Fri Dec 05 2025 21:53:40 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరి భేటీ... శశికళ వ్యవహారంపైనే?
అన్నాడీఎంకే నేతలు పన్నీర్ సెల్వం, పళనిస్వామి నేడు సమావేశం కానున్నారు.

అన్నాడీఎంకే నేతలు పన్నీర్ సెల్వం, పళనిస్వామి నేడు సమావేశం కానున్నారు. వీరిద్దరి నేతృత్వంలో పార్టీ ముఖ్యనేతలు సమావేశమై శశికళను పార్టీలో చేర్చుకునే విషయంపై చర్చించనున్నారు. శశికళ పార్టీలోకి వచ్చేందుకు అన్నాడీఎంకే నేతలతో ఇటీవల సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు అన్నాడీఎంకే నేతలు శశికళకు మద్దతుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామిల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
నడ్డా పర్యటన నేపథ్యంలో....
మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా అన్నాడీఎంకేలో కీలక నిర్ణయాలు చోటు చేసుకునే అవకాశముందని చెబుతున్నారు. వైదనిలయంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలోనూ ఈపీఎస్, ఓపీఎస్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

