Sat Dec 06 2025 04:17:37 GMT+0000 (Coordinated Universal Time)
ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటోంది : ఆనంద్ మహీంద్రా
తరచూ ట్విట్టర్లో ఏదొక ఆసక్తికరమైన వీడియోలను పోస్టు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటారు. సమాజంలో జరిగే కొన్ని..

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. తరచూ ట్విట్టర్లో ఏదొక ఆసక్తికరమైన వీడియోలను పోస్టు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటారు. సమాజంలో జరిగే కొన్ని ఘటనలపై ఆయన స్పందిస్తుంటారు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో ప్రకృతి మానవులపై ప్రతీకారం తీర్చుకుంటుంది అని పేర్కొంటూ ఓ వీడియోను జత చేశారు.
ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు అడవిలో ఒక పెద్దచెట్టును ముగ్గురు వ్యక్తులు నరికేశారు. చెట్టును నరికిన అనంతరం చైన్ సహాయంతో ముగ్గురు వ్యక్తులు చెట్టును కిందకు నెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఆ చెట్టు మొదలు వేగంగా వచ్చి ముగ్గురిలో ఒక వ్యక్తిని బలంగా బలంగా ఢీ కొట్టింది. దాంతో అతను పైకి ఎగిరి కిందపడిపోయాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ప్రకృతిని బాధపడితే అది ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు.
Next Story

