Thu Dec 18 2025 17:50:14 GMT+0000 (Coordinated Universal Time)
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జబల్పూర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానంలో బెదిరింపు లేఖ కనిపించింది

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జబల్పూర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానానికి బెదిరింపు రావడంతో విమానాన్ని నాగపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం టాయ్లెట్ లో బెదిరింపు లేఖ బయపడింది. ఇది చూసిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై సమాచారాన్ని అధికారులకు అందచేయడంతో నాగ్పూర్ లో విమానాన్ని ఆపి తనిఖీలు చేస్తున్నారు.
తనిఖీలు చేయగా...
ఉదయం బయలుదేరిన విమానంలోని టాయ్లెట్ లో బెదిరింపు లేఖ రావడంతో వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు సమాచారం ఇచ్చారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధం కనిపించలేదు. విమానంలో 69 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది ఆకతాయి చేసిన పనా? లేక కావాలని ఎవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది.
Next Story

