Fri Dec 05 2025 11:38:47 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్
జమ్మూకాశ్మీర్ లోని అవంతి పొరా ప్రాంతంలో భధ్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. జమ్మూకాశ్మీర్ లోని అవంతి పొరా ప్రాంతంలో భధ్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎందరు మరణించారన్న దానిపై ఇంకా అధికారిక సమాచారం అందలేదు. పోలీసులు తో పాటు భద్రతాదళాలు కలసి ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నాయి.
పక్కా సమాచారంతో...
ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం అందడంతో భద్రతాదళాలు, పోలీసులు అక్కడకు వెళ్లగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో భద్రతాదళాాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. నాడర్, థ్రాల్ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే జమ్మూకాశ్మీర్ లో తలదాచుకున్న ఉగ్రవాదుల కోసం గత కొద్ది రోజులుగా సెర్చ్ ఆపరేషన్ ను భద్రతాధళాలు కొనాగిస్తున్నాయి. రెండు రోజుల్లో జమ్మూకాశ్మీర్ లో జరిగిన రెండో ఎన్ కౌంటర్ ఇది అని, మొదటి ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు.
Next Story

