Mon Feb 02 2026 14:44:04 GMT+0000 (Coordinated Universal Time)
మణిపూర్లో భూకంపం
మణిపూర్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 6.14 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి

మణిపూర్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 6.14 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ఉదయాన్నే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రతగా నమోదయింది. ఈ భూకంపం పది కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
ప్రాణ, ఆస్తినష్టం...
ఉఖ్రుల్లో ఉదయం ఆరు గంటలకు ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ,ఆస్తినష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి హర్యానా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలోనూ భూకంపం సంభవించింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.
Next Story

