Sun Mar 15 2026 22:08:27 GMT+0530 (India Standard Time)
Earth Quake : జమ్మూకాశ్మీర్ లో భూకంపం
జమ్మూకాశ్మీర్ లో ఈరోజు భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం భూకంపం సంభవించినట్లు నే తెలిపింది

జమ్మూకాశ్మీర్ లో ఈరోజు భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. బారాముల్లా జిల్లాలో ఈ భూప్రకంపనలు సంభవించాయి. జమ్ము కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయ భ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. అయితే రిక్టర్ స్కేల్ పై ఎంత తీవ్రత నమోదయిందన్న విషయం మాత్రం అధికారులు వెల్లడించ లేదు.
భూకంప తీవ్రత వల్ల...
భూ కంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వంటివి లేవని ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలిసింది. బారాముల్లా జిల్లాలోని భూమిలో 4.9 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ అధికారులు తెలిపారు. భూకంపం తీవ్రత కొంత ఎక్కువగానే ఉందని ప్రజలు చెబుతున్నారు.
Next Story

