Mon Feb 02 2026 20:19:13 GMT+0000 (Coordinated Universal Time)
హర్యానాలో కంపించిన భూమి
హర్యానాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతగా నమోదయింది.

హర్యానాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతగా నమోదయింది. హర్యానాతో పాటు ఢిల్లీలో కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. గురుగామ్, హర్యానాలోని శెరియా, ఝుజ్జర్ లలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
కొత్త ఏడాది తొలి రోజు...
కొత్త సంవత్సరం తొలి రోజు తెల్లవారు జామున ఈ భూప్రకంపనలు కనిపించాయి. అయితే దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొందరు మెలుకువగా ఉన్న వారు వీధుల్లోకి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

