Sun Mar 15 2026 18:18:12 GMT+0530 (India Standard Time)
రేట్లు పెంచేసిన అమూల్

అమూల్ తన ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచినట్లు ANI నివేదించింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తన ఫుల్ క్రీం మిల్క్ ధరను లీటరుకు రూ.2 పెంచడంతో గతంలో లీటరు రూ.61 ఉండగా.. ఇప్పుడు రూ.63కి పెరిగింది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో కొత్త రేటు వర్తిస్తుంది.
అమూల్ మిల్క్ కొత్త ధరలు
అమూల్ శక్తి - లీటరు రూ.50
అమూల్ గోల్డ్ - లీటరు రూ.62
అమూల్ తాజా - లీటరుకు 56
అమూల్ పాల ధరలను ఇలా పెంచడం ఇది మూడోసారి. అంతకుముందు ఆగస్టు, మార్చిలో కంపెనీ తమ పాల ఉత్పత్తుల ధరలను పెంచింది.
గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో తమ ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాల ధరలను లీటరుకు రూ.2 పెంచినట్లు అమూల్ శనివారం ప్రకటించింది. అమూల్, మదర్ డెయిరీ రెండూ ఆగస్టులో పాల ధరలను రూ. 2 పెంచాయి.
Next Story

