Sun Mar 15 2026 16:15:38 GMT+0530 (India Standard Time)
అదానీ... అంబానీని దాటేశారు
భారత్ లో అత్యంత సంపన్నులుగా ఇప్పటి వరకూ అంబానీయే నిలిచారు. ఆయన పెట్టిన ప్రతి పరిశ్రమ ఆయన పెట్టుబడులకు బంగారంగా మార్చింది

భారత్ లో అత్యంత సంపన్నులుగా ఇప్పటి వరకూ అంబానీయే నిలిచారు. ఆయన పెట్టిన ప్రతి పరిశ్రమ ఆయన పెట్టుబడులకు బంగారంగా మార్చింది. రిలయన్స్ గ్రూపు నుంచి మొదలై డిజిటల్, రిఫైనరీలతో కలిపి ఎన్నో వ్యాపారాలు చేసిన ఆయన ఇండియాలోనే అత్యంత ధనికుడిగా దాదాపు ఆరేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఆయనను బీట్ చేసే వారు భవిష్యత్ లో ఉండరేమో అని అందరూ భావించారు.
కానీ ఈరోజు షేర్ మార్కెట్ లో...
కానీ అంబానీని అదానీ గ్రూపు దాటేసింది. ఈ ఏడాది అదానీ ఇండియాలో అత్యంత సంపన్నుడిగా గుర్తించారు. బ్లూంబర్గ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ మొదటిస్థానంలో ఉండగా, అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఇవాళ అదానీ షేర్లు పుంజుకోవడంతో ఆయన మొదటి స్థానంలో నిలిచారని బ్లూంబర్గ్ ఇండెక్స్ తెలియజేసింది.
Next Story

