Mon Dec 15 2025 20:23:37 GMT+0000 (Coordinated Universal Time)
చరిత్రలో కలసిపోనున్న అమర జ్యోతి
అమర్ జవాన్ జ్యోతి నేటితో చరిత్రలో కలసిపోనుంది.ఈరోజు మూడున్నర గంటలకు వార్ మెమోరియల్ లో ఈ జ్యోతిని విలీనం చేయనున్నారు.

అమర్ జవాన్ జ్యోతి నేటితో చరిత్రలో కలసిపోనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు వార్ మెమోరియల్ లో ఈ జ్యోతిని విలీనం చేయనున్నారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. 1971 బంగ్లాదేశ్ విమోచన కోసం జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ జ్యోతిని ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఈ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది.
యాభై ఏళ్లుగా...
యాభై ఏళ్లుగా వెలుగుతున్న ఈ జ్యోతిని వార్ మెమోరియల్ లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ యుద్ధాల్లో మరణించిన అమరుల కోసం ఢిల్లీలో వార్ మెమోరియల్ ను నిర్మించారు. 2019లో ఈ మెమోరియల్ ను నిర్మించడంతో రెండింటినీ మెయిన్ టెయిన్ చేయడం కష్టమని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అమరుల జ్యోతిని విలీనం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిపై తీవ్ర విమర్శలు చేశాయి. దేశ భక్తి, వీరుల త్యాగాన్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోయిందన్నారు.
Next Story

