Sat Dec 13 2025 13:00:34 GMT+0000 (Coordinated Universal Time)
వీరిద్దరూ ఎవరో తెలుసా? తెలిస్తే షాకవుతారు?
పై ఫొటోలో కనిపిస్తున్న మహిళలు ఇద్దరూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారే అయినా వారు ఇప్పుడు ఒకరకంగా సెలబ్రిటీలనే చెప్పాలి

పై ఫొటోలో కనిపిస్తున్న మహిళలు ఇద్దరూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారే అయినా వారు ఇప్పుడు ఒకరకంగా సెలబ్రిటీలనే చెప్పాలి. కానీ సామాన్య జీవితం గడుపుతున్నారు. ఒకరు చిన్నపాటి పూల దుకాణం నడుపుతుండగా, మరొకరు సాధారణ గృహిణి. అయితే వీరు ఎవరో కాదు. వీరిలో ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ సోదరి. మరొకరు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ సోదరి. ఇద్దరూ దైవదర్శనానికి వచ్చి ఒకరినొకరు కలుసుకున్న సందర్భంగా కెమెరాను క్లిక్ మనిపించారు.
చిన్న పూల దుకాణం నడుపుతూ...
ఉత్తరాఖండ్ లోని హృషికేశ్ సమీపంలోని నీలకంఠ ఆలయంలో ఈ ఇద్దరు కలుసుకున్నారు. యోగి ఆదిత్యానాధ్ సోదరి శశిదేవి చిన్న పూల దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోదరి వాసంతి బెన్ సాధారణ గృహిణిగా ఉన్నారు. వీరి సోదరులు ఇద్దరూ దేశంలో అగ్రస్థానంలో పదవుల్లో ఉండగా వీరిద్దరరూ మాత్రం సాదాసీదా జీవితం గడుపుతున్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా, భద్రత వంటివి లేకుండా ఇద్దరూ ఒంటరిగానే ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించి వెళ్లిపోయారు.
ఎలాంటి ఆర్భాటాలు లేకుండా...
ఒకరు దేశ ప్రధానికి సోదరి, మరొకరు దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రి. అయినా సరే వారికి ఎలాంటి భద్రత లేదు.. భయం లేదు. మన రాజకీయ నేతల కుటుంబ సభ్యులు ఎంత మంది ఇలాంటి సాదాసీదాజీవితం గడుపుతున్నారు. కార్పొరేటర్ సోదరి అయినా దర్పం, డాబు ప్రదర్శిస్తూ వాహనాలకు దారి ఇవ్వాల్సిందే. పోలీసుల భద్రత ఉండాల్సిందే. ప్రత్యేక దర్శనాలు కావాల్సిందే. కానీ వీరిద్దరూ మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఆలయానికి వచ్చి పూజలు చేసుకుని వెళ్లిపోయారు. అది కూడా సామాన్యుల మాదిరి క్యూ లైన్ లోనే. ఇది కదా మనకు కావాల్సింది.
Next Story

