Fri Dec 05 2025 12:39:33 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రులకు కేటాయించిన శాఖలివే
ఢీల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది.

ఢీల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది.మధ్యాహ్నం 12.35 నిమిషాలకు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వెనువెంటనే మంత్రులకు శాఖలకు కేటాయించారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా వద్ద కొన్ని శాఖలను అట్టిపెట్టుకుని ఉంచుకున్నారు. 27 తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తామని మంత్రులు తెలిపారు.
ముఖ్యమంత్రి వద్ద..
ముఖ్యమంత్రి రేఖాగుప్తా తన వద్ద హోంశాఖ, ఆర్థిక, విజిలెన్స్ శాఖలను ఉంచుకున్నారు. పర్వేశ్ వర్మకు విద్యాశాఖ, పబ్లిక్ వర్క్ శాఖ కేటాయించారు. రవీందర్ ఇంద్రజ్కు సాంఘిక సంక్షేమ శాఖ కేటాయించారు. ఆశిష్సూద్కు రెవెన్యూ, పర్యావరణ శాఖను, మంజీందర్ సింగ్ సిర్సాకు ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖను, కపిల్ మిశ్రాకు పర్యాటక శాఖను, పంకజ్ సింగ్కు హౌసింగ్ శాఖను కేటాయిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
Next Story

