Fri Dec 05 2025 11:59:56 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Elections : కేజ్రీవాల్ వెనుకంజ
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలందరూ వెనకంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా వెనకబడి ఉన్నారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలందరూ వెనకంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా వెనకబడి ఉన్నారు. వీరికంటే బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి అతిశీ కూడా వెనుకంజలో ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా.
ఆధిక్యంలో బీజేపీ...
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం ప్రారంభమయింది. బీజేపీ ఆధిక్యం లో ఉంది. బీజేపీ 34 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలోనే ముందంజలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 36 కావడంతో ఇప్పటికే 35 స్థానాలు రావడంతో మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉంది.
Next Story

