Fri Dec 05 2025 09:02:36 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు
నేటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు

నేటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. స్పీకర్ల సమావేశానికి 32 రాష్ట్రాల నుంచి స్పీకర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో స్పీకర్లు పార్టీ రహితంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. రెండు రోజుల పాటు ఈ స్పీకర్ల సదస్సు జరగనుంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన...
ముగింపు కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హాజరు కానున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రఘురామ కృష్ణరాజు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరు కానున్నారు. భారత్ లో స్పీకర్ గా ఎన్నికైన మొదటి భారతీయుడు విఠల్ బాయి పదవిని స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
Next Story

