Thu Mar 19 2026 09:54:41 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో మూడ్రోజులపాటు లిక్కర్ బంద్
ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం(డిసెంబర్ 2) నుండి..

ఢిల్లీలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడ్రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ అవనున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం(డిసెంబర్ 2) నుండి మద్యం విక్రయాలు ఆగిపోనున్నాయి. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో రేపు సాయంత్రం 5.30 గంటల నుండి డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, సేల్ ఔట్ లెట్స్ మూతపడనున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అనధికారికంగా ఎవరూ లిక్కర్ ను నిల్వ చేయడం కానీ, తరలించడం కానీ చేయకుండా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డిసెంబర్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్.. డిసెంబర్ 7వ తేదీన జరగనుంది.
Next Story

