Wed Jan 21 2026 03:24:12 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బంగ్లాదేశ్ కు ఇండియా విమాన సర్వీసులు రద్దు
బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇండియా నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు

బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇండియా నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ప్రకటించింది. బంగ్లాదేశ్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు షేక్ హసీనా ఇంట్లోకి, పార్లమెంటులోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేయడం భద్రతాదళాలకు కష్టంగా మారింది.
పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ...
భద్రతాదళాలు అల్లర్లను అదుపు చేయడంలో చేతులెత్తేశాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పుడు చల్లారేలా లేవు. అయితే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ ఇండియా నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లే అన్ని విమానసర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రయాణకులు అసౌకర్యానికి తాము చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.
Next Story

