Fri Dec 05 2025 12:39:13 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ప్రమాదం పై అన్ని కోణాల్లో దర్యాప్తు.. సాంకేతిక లోపమా? బర్డ్ హిట్ కారణమా?
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం కూలడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన విమానం తక్కువ ఎత్తులో కూలిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ విమానానికి అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే ఫ్లైయింగ్ కు అనుమతిస్తారు. సాంకేతిక లోపం ఉంటే ముందుగానే పసిగట్టి అన్ని చర్యలు టీం తీసుకుంటుందని అంటున్నారు. టేకాఫ్ అయిన నిమిషాల్లో కూలిపోయిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక లోపం అప్పటికప్పుడు తలెత్తే అవకాశాలను ఎవరూ తోసిపుచ్చకపోయినా, టేకాఫ్ అయిన వెంటనే టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని అంటే అది కారణం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అనుభవమున్న పైలెట్లు...
అన్ని సాంకేతిక పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే టేకాఫ్ కు అనుమతిస్తారని, ఇద్దరు పైలెట్లు సుదీర్ఘ అనుభవం ఉన్న వారు కావడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశమని పలువురు పౌర విమానయాన నిపుణులు చెబుతున్నారు. వేలాది కిలోమీటర్ల విమానం నడిపిన అనుభవముంది. విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్ దొరికితే అందులో ఉన్న సమాచారాన్ని బట్టి విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణమని తెలిసింది. ఏటీసీకి ఎమెర్జీన్సీ కాల్ రావడం, వెంటనే కట్ కావడంతో పాటు ఎయిర్ పోర్టు పరిసరాల్లోని జనావాసాల్లోనే విమానం కూలడంతోనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. విమానం కూలడంతో జనావాసాల్లో ఉన్న భవనాలు పూర్తిగా శిధిలమయ్యాయి.
పక్షులు ఆ ప్రాంతంలో ఉన్నాయా?
సాధారణంగా టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదం జరిగిందంటే బర్డ్ హిట్ కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అక్కడ పక్షులు తిరుగుతున్నాయా? లేదా? అన్నది కూడా విచారిస్తున్నారు. కాలి బూడిద అయిన విమానంలో ఎంత మంది మరణించారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే విమానం కూలిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కానీ, పౌర విమానయాన శాఖ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం విమానం కూలిందని మాత్రమే చెప్పింది. హాస్టల్ బిల్డింగ్ భవనంపై కూలడంతో మెడికోలు మరణించడంతోనే కెప్టెన్ సునీత్ సబర్వాల్ సుదీర్ఘ ఏవియేషన్ ఫ్లై అవర్స్ అనుభవం ఉందని చెబుతున్నారు. అయితే ముందు సహాయక చర్యలు మాత్రమే పర్యవేక్షిస్తున్నామని, ముందు క్షతగాత్రులను రక్షించిన తర్వాత మాత్రమే విచారణ చేపడతామని తెలిపారు.
Next Story

