Mon Mar 02 2026 11:08:26 GMT+0530 (India Standard Time)
విమాన ప్రయాణికులకు అలర్ట్
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్లకు వెళ్లే అన్ని విమానాల సస్పెన్షన్ను ఎయిర్ ఇండియా సోమవారం రాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది.
ప్రయాణికులకు సూచనలు...
ఈ మేరకు ప్రయాణికులకు సూచనలు చేసింది. యుద్ధం జరిగే పరిస్థితులను బట్టి విమానాల రాకపోకలపై ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తామని తెలిపింది. ప్రయాణికులు ఎవరూ ఎయిర్ పోర్టుకు చేరుకుని అవస్థలు పడవద్దని తెలిపింది. కావాల్సిన సమాచారాన్ని ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకుఅందిస్తామని తెలిపింది.
Next Story

