Fri Dec 05 2025 13:03:33 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. థాయ్ లాండ్ లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. థాయ్ లాండ్ లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. థాయ్ లాండ్ లోని పుకెట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఏఐ 379 విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే థాయ్ లాండ్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానాన్ని బాంబు స్క్కాడ్ తనిఖీలు ప్రారంభించింది.
156 మంది ప్రయాణికులు...
ఈ విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. బాంబు స్క్కాడ్ తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే ఆ విమానాన్ని ఫ్లై కావడానికి అనుమతిస్తారు. ప్రయాణికులను విమానంలో నుంచి దించి ఎయిర్ పోర్టులోని లాంజ్ కు తరలించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

