Wed Jan 28 2026 16:09:49 GMT+0000 (Coordinated Universal Time)
అగ్నిబాణ్ మళ్లీ వాయిదా.. ఇదే రీజన్
అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడింది. శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది

అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ జామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా పడింది.
సాంకేతిక సమస్యలు....
అయితే సాంకేతిక సమస్యలు ఎందుకు తలెత్తాయో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ ఏడో తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి కావడంతో ఎప్పుడు మళ్లీ ప్రయోగిస్తారన్నది మాత్రం తెలియలేదు. దీనిపై త్వరలో ఇస్రో శాస్త్రవేత్తలు అధికారిక ప్రకటన చేసేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
Next Story

