Thu Dec 18 2025 13:43:10 GMT+0000 (Coordinated Universal Time)
లైంగిక సమ్మతి వయసు : 18 నుండి 16 కు తగ్గిస్తే చాలా సమస్యలే!
లా కమిషన్ లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టానికి కొన్ని సవరణలను ప్రతిపాదించింది

లా కమిషన్ లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టానికి కొన్ని సవరణలను ప్రతిపాదించింది. దేశంలో లైంగిక సమ్మతి వయసు తగ్గించాలనే విజ్ఞప్తులు వస్తుండడంతో కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయసు 18 ఏళ్లు ఉంది. దాన్ని తగ్గించడం సరికాదని తెలిపింది. దేశంలోని కొన్ని కోర్టులు లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే విషయంలో వయసుకు సంబంధించి సూచనలు చేసిన నేపథ్యంలో లా కమిషన్ అందుకు వ్యతిరేకంగా తన నివేదికను సమర్పించింది.
పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న లైంగిక సమ్మతి వయసును మార్చడం అనేది సరైన నిర్ణయం కాదని లా కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయసును తగ్గిస్తే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని లా కమిషన్ అభిప్రాయపడింది. పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న లైంగిక సమ్మతి వయసును తగ్గించడం సరైంది కాదని అభిప్రాయపడింది. అలా తగ్గిస్తే బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని తెలిపింది. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏళ్లుగా జరుగుతున్న పోరాటాలకు విలువ లేకుండా పోతుందని లా కమిషన్ అభిప్రాయపడింది. 16 నుంచి 18 ఏళ్ల బాల బాలికలు తమ ఇష్టపూర్వకంగానే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే అలాంటి కేసులను పరిష్కరించేందుకు పోక్సో చట్టంలో కొన్ని సవరణలు చేయవచ్చని లా కమిషన్ అభిప్రాయపడింది.
Next Story

