Mon Dec 15 2025 20:22:48 GMT+0000 (Coordinated Universal Time)
70 ఏళ్ల వయసులో తలతో ఉట్టికొట్టిన అవ్వ.. వీడియో ఇదిగో !
వెన్న దొంగ అయిన శ్రీకృష్ణుడికి పెరుగు, వెన్న, పాలు దొరకకుండా ఉట్టిలో ఉంచేవారు. అయినా చిన్నికృష్ణుడు..

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉత్తరాదిన కొనసాగుతున్నాయి. రోజుకో కార్యక్రమంతో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు నార్త్ ప్రజలు. ముఖ్యంగా ఉట్టి కొట్టే కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. అలాంటి వేడుకలో ఓ అవ్వ ఎంతో అలవోకగా ఉట్టిని కొట్టి కిందికి దిగడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మూడు పదుల వయసు రాకుండానే అన్నిరకాల రోగాల బారిన పడుతున్న ఈ రోజుల్లో ఏడుపదుల వయసున్న అవ్వ ఉట్టిని కొట్టడం అంటే మామూలు విషయం కాదు.
వెన్న దొంగ అయిన శ్రీకృష్ణుడికి పెరుగు, వెన్న, పాలు దొరకకుండా ఉట్టిలో ఉంచేవారు. అయినా చిన్నికృష్ణుడు తన స్నేహితుల సహాయంతో ఉట్టిలో దాచిన పదార్థాలను తినేసేవాడు. కృష్ణుడిపై యశోదకు నిత్యం ఇరుగు పొరుగువారు వచ్చి ఫిర్యాదులు చేసేవారు. ఆ ఆచారాన్ని (మఖాన్ చోర్) తదుపరి తరాలకు బదిలీ చేసే కార్యక్రమమే ఉట్టి కొట్టుడు. 70 ఏళ్లకు పైగా వయసున్న ఓ వృద్ధురాలు పది మంది మహిళల చేతులు, భుజాల సాయంతో పైకి ఎగిరి తాడుకు కట్టిన ఉట్టిని తలతో కొట్టేసి మరీ కిందకు దిగిపోవడం చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.
వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని, మనం వృద్ధులమయ్యేంతవరకూ వయసు లెక్కించేది కాదని తెలుసుకునేంతవరకూ ఇంత వయసొచ్చిందని లెక్కిస్తుంటాం అన్న కత్రినా మేయర్ క్వొటేషన్ ను అవ్వ రుజువు చేసిందంటూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ లో రాశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
News Summary - Age is only a number : Sivasena mp tweets inspiring dahi handi video
Next Story

