Sat Dec 06 2025 00:49:17 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : ఇప్పటి వరకూ భారత్ లో జరిగిన విమాన ప్రమాదాలు.. 2009 తర్వాత?
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద జరిగిన తర్వాత భారత్ లో అనేక సార్లుజరిగిన విమాన ప్రమాదాలపై చర్చ జరుగుతుంది.

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద జరిగిన తర్వాత భారత్ లో అనేక సార్లుజరిగిన విమాన ప్రమాదాలపై చర్చ జరుగుతుంది. 2009 తర్వాత జరిగిన అతి పెద్ద ప్రమాదమిదే. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక విమాన ప్రమాదాలు జరిగినా 1990వ దశకం తర్వాత జరిగిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఈ సమయంలో ఎక్కువ ఘటనలు జరిగింది తక్కువే అయినా అడపా దడపా సాంకేతిక లోపాల కారణంగానే కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అహ్మదాబాద్ లో అతి పెద్ద ప్రమాద ఘటన అని పౌర విమానయాన శాఖ చెబుతుంది. పౌర విమాన యాన శాఖలో అతి పెద్ద విషాదం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అభిప్రాయపడ్డారు. ఎక్కువగా ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలే ప్రమాదానికి గురి కావడం యాధృచ్ఛికమా? అన్నకామెంట్స్ వినపడుతున్నాయి.
ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎక్కువగా...
1990లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 14వ తేదీన 1990న జరిగిన ఎయిర్ ఇండియా విమానంలో 92 మంది మరణించారు. బెంగళూరు విమానశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ బస్ A 320 కూలడంతో ఇంత భారీ సంఖ్యలో మరణించారు. 1991లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం యలహంక స్టేషన్ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఇరవై ఐదు మంది మరణించారు. అవ్రో HS -748 విమానం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. 1991లో ఆగస్టు 16వ తేదీన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం మణిపూర్ లోని ఇంఫాల్ వద్ద కూలింది. ఈ ఘటనలో 69 మంది మరణించారు. అనేక సార్లు హైజాక్ కు ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు గురయినా మృతులు ఎవరూ లేరు.
2010లో మంగళూరు ఎయిర్ పోర్టులో...
1993 ఏప్రిల్ 26వ తేదీన ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం మహారాష్ట్రలోని ఔరంగా బాద్ లో కూలింది. టేకాఫ్ సమయంలో రన్ వే చివర ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో యాభై ఐదు మంది మరణించారు. నవంబర్ 12, 1996లో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం 763 అండ్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం 1907 హర్యానాలోని చర్కి దాద్రి సమీపంలో కూలింది. ఈ ప్రమాదంలో 349 మరణించారు. జూలై 17, 2000 సంవత్సరంలో బోయింగ్ 737 విమానం బీహార్ లోని పాట్నాలో కూలగా యాభై ఐదు మంది విమానంలోనూ, భూమిపై ఉన్న ఐదుగురు మొత్తం అరవై మంది మరణించారు. మరో అతి పెద్ద విమాన ప్రమాదం 2010లో మంగళూరు ఎయిర్ పోర్టుకు సమీపంలో జరిగింది. రన్ వే పై నంచి దూసుకెళ్లిన బోయింగ్ 737 విమాన ప్రమాదంలో 158 మంది మరణించారు. 2010 తర్వాత జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని అంటున్నారు.
రక్తదానం చేయాలని...
మృతుల సంఖ్య ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా వందల సంఖ్యలో మరణించినట్లు చెబుతున్నారు. డీజీసీఏ విచారణ లో ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలియనున్నాయి. మృతుల వివరాలను కూడా ఈరోజు రాత్రికి కాని, రేపు ఉదయానికి కానీ ప్రకటించే అవకాశముంది. మరొక వైపు గుజరాత్ ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపు నిచ్చారు. రక్తం అవసరమవుతుందని, రక్తదానం చేయాలని, అందుకోసం గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. రక్తదాతలు ముందుకు వచ్చి ఈ ఆపద సమయంలో ఆదుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఆసుపత్రుల్లో రక్తం కొరత తీవ్రంగా ఉందని దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. మృతుల సంఖ్య వందల్లోనే ఉండే అవకాశముందని అంటున్నారు.
Next Story

