Sat Mar 07 2026 17:42:56 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్... ఈరోజు లక్షకు దిగువన కేసులు
చాలా రోజుల తర్వాత భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 83,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

చాలా రోజుల తర్వాత భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 83,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు లక్షకు దిగువన కేసులు నమోదయ్యాయి. ఈరోజు 895 మంది మరణించారు. మరణాల సంఖ్య మాత్రం కొద్దిగా పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,06,31,204 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు.....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 11,08,939 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 5,41,53,712 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,02,145 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,70,21,44,432 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

