రూ.100 లంచం కేసులో 39 ఏళ్లు కోర్టులో పోరాడిన ఉద్యోగి..!
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాజా తీర్పు.. న్యాయం జరగడంలో జాప్యం జరిగినా.. నిజాన్ని దాచలేమని రుజువు చేసింది.

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాజా తీర్పు.. న్యాయం జరగడంలో జాప్యం జరిగినా.. నిజాన్ని దాచలేమని రుజువు చేసింది. నిజానికి 39 ఏళ్ల నాటి కేసులో ఓ వ్యక్తికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది. మొత్తం వ్యవహారం రూ.100 లంచానికి సంబంధించినది. కింది కోర్టు శిక్ష విధించిన వ్యక్తికి హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. దిగువ కోర్టు వేసిన శిక్షను కూడా కోర్టు రద్దు చేసింది. లంచం డిమాండ్ చేసినట్లు ఖచ్చితమైన ఆధారాలు లేవు.. అందుకే ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.
మొత్తం విషయం 1986 సంవత్సరం నాటిది. ఆ సమయంలో రూ. 100 అనేవి భారీ మొత్తం. అశోక్ కుమార్ వర్మ అనే ఉద్యోగి బకాయి బిల్లును సెటిల్ చేసేందుకు జగేశ్వర్ ప్రసాద్ అవస్తీని రూ.100 లంచం అడిగారనేది ఆరోపణ. దీనిపై అశోక్ కుమార్ ఫిర్యాదు చేశారు. అనంతరం లోకాయుక్త ఉచ్చు బిగించి ఫినాల్ఫిల్ పౌడర్ పూసిన కరెన్సీ నోట్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2004లో ఈ కేసులో కింది కోర్టు ఉద్యోగికి ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ నిర్ణయంపై అశోక్‌కుమార్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ రుజువులు నిరూపించడంలో విఫలమైందని.. అందువల్ల ట్రయల్ కోర్టు నేరారోపణ ఉత్తర్వు సమర్థించబడదని కోర్టు గుర్తించింది. దీని ఆధారంగా, హైకోర్టు అప్పీల్‌ను స్వీకరించింది. ఈ క్రమంలోనే నేరం, శిక్ష రెండింటినీ రద్దు చేసింది.

