మరోసారి ఆ వైరస్ అక్కడకు వచ్చేసింది.. జంతువులను చంపేస్తోంది
మరోసారి ఆ వైరస్ అక్కడకు వచ్చేసింది.. జంతువులను చంపేస్తోంది

అస్సాం రాష్ట్రంలో మరోసారి స్వైన్ ఫీవర్ కలకలం మొదలైంది. డిబ్రూగఢ్లోని భోగాలి పత్తర్ గ్రామంలోని పందులకు స్వైన్ ఫీవర్ వైరస్ పాజిటివ్ అని తేలడంతో.. అధికారులు, పందుల పెంపకం దారులు అప్రమత్తమయ్యారు. దిబ్రూఘర్ పశుసంవర్ధక, పశువైద్య అధికారి డాక్టర్ హిమాందు బికాష్ బారువా శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైరస్ కేంద్రానికి 1 కిమీ పరిధిలో ఉన్న అన్ని పందులను చంపినట్లు చెప్పారు. "మేము మొదట 1 కిమీ వరకు ఉన్న ప్రాంతాన్ని వ్యాధి సోకిన ప్రాంతంగా ప్రకటించాము. నిబంధనల ప్రకారం, స్వైన్ ఫీవర్ సోకిన ప్రాంతంలో అన్ని పందులను చంపి పాతిపెట్టాము. అదే సమయంలో, మేము మొత్తం ప్రాంతాన్ని కూడా శానిటైజ్ చేసాము," అని చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మానవులకు సోకదు లేదా వ్యాపించదు. అయినప్పటికీ ఇది పందులకు ప్రాణాంతకం. అత్యంత అంటువ్యాధిగా భావిస్తూ ఉంటారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2020 నుండి ఈ ఏడాది జూలై 11 వరకు రాష్ట్రంలో 1,181 పందులను చంపగా.. 40,159 పందులు జ్వరంతో మరణించాయి.

