Fri Jan 30 2026 01:13:54 GMT+0000 (Coordinated Universal Time)
అదానీ... వ్యవహారం.. ఐదు రోజుల నుంచి
ఐదు రోజుల నుంచి పార్లమెంటును అదానీ వ్వవహారం కుదిపేస్తుంది. ఉభయ సభల్లో ఎలాంటి చర్చలు లేకుండానే వాయిదా పడుతున్నాయి

గత ఐదు రోజుల నుంచి పార్లమెంటును అదానీ వ్వవహారం కుదిపేస్తుంది. ఉభయ సభల్లో ఎలాంటి చర్చలు లేకుండానే వాయిదా పడుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానం కింద చర్చ జరగాల్సి ఉన్నా విపక్షాలు అదానీ గ్రూపు వ్యవహారంపై చర్చించాలని పట్టుబడుతుండటంతో ఐదు రోజులుగా ఉభయ సభలు వాయిదా పడుతూనే ఉన్నాయి.
సభలు వాయిదా...
అదానీ స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నాయి. వీటిని లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఇద్దరూ అంగీకరించకపోవడంతో పోడియం వద్దకు సభ్యులు దూసుకు వస్తున్నారు. దీంతో ఉభయ సభలు ప్రతి రోజూ వాయిదా పడుతున్నాయి.
- Tags
- adani
- parliament
Next Story

