Thu Mar 19 2026 17:03:04 GMT+0530 (India Standard Time)
త్వరలో ఓటర్ల సంఖ్యలో భారత్ రికార్డు ఇదే
భారత్ లో 99.1 ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ తెలిపింది. త్వరలోనే 100 కోట్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్ లో 99.1 ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ తెలిపింది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించబోతోంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఆ సంఖ్య ఈ ఏడాదికి వచ్చే సరికి భారీగా పెరిగింది.
మొత్తం ఓటర్లలో...
మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18-29 ఏళ్ల మధ్య వయసున్న యువత ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2024తో పోలిస్తే 2025లో స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తిలో తేడా కూడా తగ్గిపోయిందని, 20 24లో ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా.. 25 నాటికి అది 954కు పెరిగిందని, మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లకు చేరుకుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
Next Story

