Fri Dec 05 2025 13:19:13 GMT+0000 (Coordinated Universal Time)
పదివేలకు పైగా కేసులు నమోదు
భారత్లో 10,112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా 22 మంది మరణించారు

పదివేలకు పైగానే కేసులు రోజూ భారత్లో నమోదవుతున్నాయి. రోజూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్లో 10,112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజులో కరోనా కారణంగా 22 మంది మరణించారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది.
యాక్టివ్ కేసులు...
ఇక భారత్లో ప్రస్తుతం 67,806 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ శాతం ఎక్కువగానే ఉన్నా జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదకరమని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఆ యా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Next Story

