Mon Mar 16 2026 07:51:57 GMT+0530 (India Standard Time)
ఆర్థిక వేత్త అభిజిత్ సేన్ మృతి
ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ మృతి చెందారు. ఆయన నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు

ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ మృతి చెందారు. ఆయన నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ప్రముఖ ఆర్థిక వేత్తగా అభిజిత్ సేన్ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అభిజిత్ సేన్ మరణించిన విషయాన్ని ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ ధృవీకరించారు. నిన్న రాత్రి గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ అప్పటికే అభిజిత్ సేన్ ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ జేఎన్యూలో...
ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలో ఆయన ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ గా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో అభిజిత్ సేన్ ప్రణాళిక సంఘం సభ్యుడిగా కొనసాగారు. దీంతో పాటు వ్యవసాయ ధరల కమిషన్ ఛైర్మన్ గా కూడా అభిజిత్ సేన్ వ్యవహరించారు. అభిజిత్ సేన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

