Fri Mar 27 2026 18:24:38 GMT+0530 (India Standard Time)
పార్టీలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి + క్యాష్
బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు.

పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువవుతున్నాయి. తాజాగా బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అధ్యక్షుడిగా భగవంత్ మాన్ వ్యవహరిస్తున్నారు. అయితే తనను బీజేపీలో చేరాలని ఒక కీలక నేత వత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. పార్టీలో చేరితే కేంద్ర మంత్రి పదవి తో పాటు పెద్దయెత్తున నగదు కూడా ముట్ట చెబుతానని అన్నట్లు భగవంత్ మాన్ ఆరోపించారు.
సమయం వచ్చినప్పుడు....
సరైన సమయంలో తనకు ఆఫర్ ఇచ్చిన నేత పేరును బయటపెడతానని భగవంత్ మాన్ చెబుతున్నారు. తమ పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ నేతలు వలపన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు కూడా తీవ్రంగా విన్పిస్తున్నాయి.
Next Story

