Sun Mar 15 2026 11:09:18 GMT+0530 (India Standard Time)
గుజరాత్ మాదే.. రాసిపెట్టుకోండి
గుజరాత్ ఎన్నికల్లో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీదేనని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

గుజరాత్ ఎన్నికల్లో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీదేనని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో 92 స్థానాలను గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. సూరత్ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సూరత్ లోనే ఏడు నుంచి ఎనిమిది సీట్లు గెలుచుకుటామని ఆయన తెలిపారు. గుజరాత్ లో ఎలాంటి భయాలు లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చని ఆయన అన్నారు.
అందరూ అండగా నిలబడండి...
ముఖ్యంగా మేధావులు, యువకులు, మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలబడాలని ఆయన కోరారు. తాము అధికారంలోకి వస్తే ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రిస్తామని ఆయన తెలిపారు. ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన ఇచ్చారు. వైద్యాన్ని కూడా తాము ఉచితంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే అందిస్తామని ఆయన చెప్పారు. తాము ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. తమకు ఎవరితోనూ పోటీ లేదని, తామే అధికారంలోకి వచ్చేందుకు ముందున్నామని ఆయన చెప్పారు.
Next Story

