Wed Dec 31 2025 06:57:27 GMT+0000 (Coordinated Universal Time)
పాన్ - ఆధార్ కార్డు లింకుకు నేటితో ఆఖరు
నేటితో ఆధార్- పాన్ కార్డుకు సంబంధించిన లింక్ గడువు ముగియనుంది

నేటితో ఆధార్- పాన్ కార్డుకు సంబంధించిన లింక్ గడువు ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా ఆధార్ తో పాన్ కార్డును అనుసంధానం చేయాలని చెప్పింది. అయితే ఇప్పటి వరకూ చాలా మంది లింక్ చేసుకున్నప్పటికీ కొందరు మాత్రం ఇంకా చేయలేదు. అయితే ఈరోజు ఆఖరి గడువు అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
గడువు పొడిగింపు...
గడువు దాటితే అంటే ఈరోజు దాటితే పాన్ కార్డు తో ఆధార్ ను లింక్ చేయకపోతే పాన్ కార్డు సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని భారత ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆర్థిక లావాదేవీల్లోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆధార్- పాన్ కార్డుతో లింక్ చేసే గడువు పొడిగిస్తుందా? లేదా? అన్నది ఈరోజు తేలనుంది. తేలకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు.
Next Story

