Sat Mar 07 2026 17:43:27 GMT+0530 (India Standard Time)
రైలులో అకస్మాత్తుగా మంటలు... భయంతో ప్రయాణికులు
విశాఖపట్నం నుంచి వెళుతున్న కిరోండల్ వెళుతున్న రైలుకు ప్రమాదం తప్పింది.

విశాఖపట్నం నుంచి వెళుతున్న కిరోండల్ వెళుతున్న రైలుకు ప్రమాదం తప్పింది. నిన్న అర్థరాత్రి రైలుపై భారీ చెట్టు కూలడంతో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. దీంతో రైలును నిలిపేశారు. ప్రయాణికులు రైలుదిగి బయటకు పరుగులు తీశారు. చీకట్లో పరుగులు తీయడంతో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
చిమ్మ చీకట్లోనే....
అనంతగిరి మండలం తైడా - చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. విద్యుత్ లైన్ పై చెట్టు పడటంతో మంటలు ఒక్కసారిగా లేచాయి. చుట్టూ చీకటి అయినా ప్రాణభయంతో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. విద్యుత్తు లైన్ ను పునరుద్ధించిన మూడు గంటల తర్వాత రైలు తిరిగి కిరండోల్ కు బయలుదేరి వెళ్లింది.
Next Story

