Thu Mar 19 2026 10:30:03 GMT+0530 (India Standard Time)
ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మరణించారు.

పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులతో కూడిన ఒక వ్యాన్ రోడ్డు పక్క నిలిపి ఉన్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. 17 మంది స్పాట్ లోనే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు ఇరవై మంది ప్రయాణికులు వ్యాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
అతి వేగమే....
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వేగంగా వ్యాన్ డ్రైవర్ వస్తుండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. మంచు కురుస్తుండటం వల్ల రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కు కన్పించక వ్యాన్ డ్రైవర్ దానిని ఢీకొట్టాడని పోలీసులు చెబుతున్నారు.
Next Story

