Sun Mar 08 2026 12:11:22 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ వ్యూహ కమిటీ సమావేశం నేడు
ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం జరగనుంది

ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 10.45 గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ తదితర ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
31వ తేదీ నుంచి....
ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో రెండు విడతలుగా సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రధాన సమస్యలపై ఈ బడ్జెట్ సమావేశాల్లో పోరాడాలని కాంగ్రెస్ భావిస్తుంది. పెట్రోలు ధరల పెరుగుదల, కరోనా తీవ్రత వంటి అంశాలపై సభను ఈ సారి స్థంభింప చేసే అవకాశముంది.
Next Story

