Thu Mar 19 2026 18:26:09 GMT+0530 (India Standard Time)
లోయలో పడ్డ బస్సు.. 16 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మరణించారు.

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కులు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం సైంజ్ ప్రాంతానికి ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదానికి వర్షాలు, మితిమీరిన వేగం కారణమని పోలీసులు చెబుతున్నారు.
కులు జిల్లాలోని...
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కులు జిల్లాలోని జంగ్లా గ్రామ సమీపంలో బస్సు లోయలో పడింది. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రును సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
Next Story

