Sun Mar 08 2026 04:08:20 GMT+0530 (India Standard Time)
ముంబయిలోని అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం
ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇరవై అంతస్థుల బిల్డింగ్ లో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇరవై అంతస్థుల బిల్డింగ్ లో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. పదమూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముంబయిలోని ఇరవై అంతస్థులున్న కమలా బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. కమలా బిల్డింగ్ లోని మూడో అంతస్థులో తొలుత ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
మూడో అంతస్థులో....
అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ వల్ల ప్రమాదం జరిగిందా? అన్నది అధికారులు విచారిస్తున్నారు. ఈ ప్రమాదంలో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పదమూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Next Story

