Tue Jan 20 2026 08:45:49 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ .. తప్పిన ప్రమాదం
రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ను గమనించి రైలును డ్రైవర్ ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర్ప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది.

రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ను గమనించి రైలును డ్రైవర్ ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర్ప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ప్రేమరరాజ్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ను పెట్టారు. అయితే గమనించకుండా రైలును నడిపి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ముందుగా గమనించి...
అయితే రైలు డ్రైవర్ పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ ను గుర్తించిన వెంటనే ఆపేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకన్నారు. రైలు డ్రైవర్ ను అభినందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దుండగులు దుశ్చర్యకు గ్యాస్ సిలిండర్లు పెట్టి ప్రమాదాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.
Next Story

