Fri Mar 20 2026 23:32:21 GMT+0530 (India Standard Time)
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేడు సమావేశం కానుంది

కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోసారి సోనియా గాంధీ కోవిడ్ బారిన పడి కోలుకోవడంతో ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రాహుల్ యాత్రపై...
ఏఐసీసీ అధ్యక్ష్య ఎన్నికల షెడ్యూల్ తో పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర పై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే రూపొందింది. దీనిని ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు. పార్టీని బలోపేతం చేసే అంశంపైనా చర్చించనున్నారు.
Next Story

