Mon Feb 02 2026 00:04:55 GMT+0000 (Coordinated Universal Time)
కరోల్ బాగ్ లో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలోని కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోల్ బాగ్ లో ఉన్న గఫార్ షూ మార్కెట్ లో ఈ ప్రమాదం జరిగింది.

వేసవి కాలం ముగుస్తున్న తరుణంలోనూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఢిల్లీలోని కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోల్ బాగ్ లో ఉన్న గఫార్ షూ మార్కెట్ లో ఈ ప్రమాదం జరిగింది. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో 39 అగ్నిమాపక శకటాలు శ్రమించి మంటలను అదుపులోకి వచ్చాయి.
మూడు లైన్లకు...
అయితే కరోల్ బాగ్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. షూ మార్కెట్ కావడంతో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. మార్కెట్ లో మూడు లైన్లకు మంటలు వ్యాపించడంతో అగ్నిమాపకదళాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమ పడాల్సి వచ్చింది. షూ ఫ్యాక్టరీ కావడంతో మంటలు అంత త్వరగా అదుపులోకి రాలేదు.
Next Story

