Sat Dec 06 2025 01:09:44 GMT+0000 (Coordinated Universal Time)
దీపావళికి స్పెషల్ గిప్ట్.. కార్లు ఇచ్చిన యజమాని
చెన్నైలోని ఒక సంస్థ యజమాని తమ సంస్థ ఉద్యోగులకు ఏకంగా కార్లు, బైకులు బహుమతులుగా ఇచ్చి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు

దీపావళి పండగ వస్తుందంటే ఉద్యోగులందరూ బోనస్ ల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి సంస్థ తమకు బోనస్ ఇస్తుందన్న ఆశతో ఉంటారు. నగదు రూపంలో కొందరు బోనస్ లను ఇస్తుండగా, మరికొందరు ఆశ్చర్యకరమైన రీతిలో బహుమతులను తమ ఉద్యోగులకు ఇస్తారు. ఉద్యోగులు సంతృప్తికరంగా సంవత్సరం అంతా పనిచేసేందుకు యజమానులు ఇలా చేస్తుండటం ఆనవాయితీగా వస్తుంది.
జ్యుయలరీ సంస్థ యజమాని...
చెన్నైలోని ఒక సంస్థ యజమాని తమ సంస్థ ఉద్యోగులకు ఏకంగా కార్లు, బైకులు బహుమతులుగా ఇచ్చి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తమిళనాడులోని చల్లాని జ్యుయలరీ సంస్థ యజమాని ఉద్యోగుల పనితీరును బట్టి కొందరికి కార్లు, మరికొందరికి బైకులను దీపావళికి కానుకగా ఇచ్చారు. పది మందికి కార్లు, ఇరవై మందికి బైకులు ఆయన పంచిపెట్టారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులతో సహా భోజనాలకు ఆహ్వానించిన ఆయన ఆశ్చర్యకరంగా ఈ బహుమతులను అందచేశారు. దీంతో ఉద్యోగులు తమ యజమాని తమ పట్ల చూపిన శ్రద్ధ పట్ల మురిసిపోతున్నారు.
Next Story

