Sun Apr 05 2026 19:48:52 GMT+0530 (India Standard Time)
లడఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్ల దుర్మరణం
వాహనం రోడ్డుపై నుండి జారి షియోక్ నదిలో పడిపోయింది, దీంతో అందులో ఉన్న వారందరికీ గాయాలు అయ్యాయి" అని భారత సైన్యం..

లడఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఆర్మీ జవాన్లు దుర్మరణం చెందారు. లడఖ్‌లోని తుర్టుక్ సెక్టార్‌లోని ష్యోక్ నదిలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఏడుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు.. పలువురు గాయపడ్డారు. వాహనం దాదాపు 50-60 అడుగుల లోతులో పడిపోయింది. "26 మంది సైనికులతో కూడిన బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళుతోంది.
వాహనం రోడ్డుపై నుండి జారి షియోక్ నదిలో పడిపోయింది, దీంతో అందులో ఉన్న వారందరికీ గాయాలు అయ్యాయి" అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 26 మంది సైనికులను ఆర్మీ ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. లేహ్ నుండి మెడికల్ బృందాలను పార్తాపూర్‌కు తరలించారు. ఏడుగురు సైనికులు గాయలతో మరణించారని తెలుస్తోంది. "గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వైమానిక దళం సహాయంతో క్షతగాత్రులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నాం" అని భారత సైన్యం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

