Thu Dec 18 2025 09:12:00 GMT+0000 (Coordinated Universal Time)
ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు వీరమరణం
వర్షం పడుతుండటంతో పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగి జవాన్లు మరణించి ఉంటారని ఆర్మీ అధికారులు..

జమ్మూకాశ్మీర్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం చెందారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమర జవాన్లకు సంతాపం తెలుపుతున్నారు. జమ్ము-పూంఛ్ రహదారిపై భారత ఆర్మీకి చెందిన ఓ వాహనం వెళ్తోంది.
ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం జరిగింది. తొలుత ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదంగా భావించారు. వర్షం పడుతుండటంతో పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగి జవాన్లు మరణించి ఉంటారని ఆర్మీ అధికారులు అంచనా వేశారు. కానీ.. అది ఉగ్రదాడి అని దర్యాప్తులో తేలిందని తాజాగా భారత ఆర్మీ ప్రకటించింది. జమ్మూ -పూంచ్ హైవేపై రాజౌరీ సెక్టార్ తోతావాలి గల్లీ దగ్గర జవాన్లు వెళ్తోన్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరగా.. ఆ దాడిలో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ యునిట్ కు చెందిన జవాన్లు వీరమరణం చెందినట్లు ఆర్మీ ధృవీకరించింది. ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జవాన్లను మోహరించిన సమయంలోనే ఈ దాడి జరిగింది.
Next Story

