Fri Dec 05 2025 13:37:58 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : విమాన ప్రమాదంలో 242 మంది మృతి .. సీపీ అధికారిక ప్రకటన
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 242 మంది మరణించారని చెబుతున్నారు.

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 242 మంది మరణించారని చెబుతున్నారు. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ ప్రకటించారు. అసోసియేటెడ్ ప్రెస్ కు ఈ మేరకు పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. అహ్మదాబాద్ లో టేకాఫ్ జరిగిన వెంటనే విమానం ప్రమాదానికి గురయింది. అయితే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఇచ్చిన సమాచారం మేరకు 242 మంది మరణించారని చెబుతున్నారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణికులేనా? నేల మీద పడటంతో ఇంకా ఎంత మంది చనిపోయారన్న దానిపై ఇంత వరకూ ఎవరూ నిర్థారించలేకపోతున్నారు. అనేక 242 మంది చనిపోయింది ప్రయాణికులా? బయట వారితో కలిపా? అన్నది తెలియాల్సి ఉంది.
ఒక్కసారిగా మంటలు చెలరేగి...
దీంతో పాటు విమాన భవనంపై పడటంతో పాటు, 1,20,000 లీటర్ల ఏవిషియన్ ఫ్యూయల్ కలిగిన విమానం కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా బతికే అవకాశం లేదు. విమాన ప్రమాదంలో ఒక్కరూ బతకలేదని పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ తెలపడంతో ఇప్పుడు విమానంలో ప్రయాణించే వారు అందరూ మరణించినట్లే తెలిసింది. ఇది అత్యంత విషాదకరమైన ఘటన. ఇందులో వంద మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. భారత దేశ చరిత్రలో అతి పెద్ద విషాదమని చెబుతున్నారు. లిఫ్ట్ వే పనిచేయకపోవడంతో విమానం పైకి ఎగరలేకపోయిందని, అందువల్లనే ప్రమాదం జరిగిందని కొందరు అనుమానిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి మృతి,,,
లిఫ్ట్ వే పనిచేయక పోవడంతో వెంటనే ల్యాండ్ చేయడానికి సరైన అనువైన ప్రదేశం లేకపోవడంతో పాటు, ప్రయాణికులను అత్యవసర ద్వారాల ద్వారా పారాచూట్ల ద్వారా కిందకు దించే సమయం కూడా లేదు. అంతా క్షణాల్లో జరిగిపోవడంతో అతి పెద్ద దుర్ఘటన జరిగిందని సాంకేతికంగా కొందరు పౌర విమానయానశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మృతదేహాలు కొన్ని కనుక్కోలేని స్థితిలో ఉండటంతో కుటుంబీకులకు అప్పగించాలన్నా డీఎన్ఏ టెస్ట్ లు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులకు అధికారికంగా సమాచారం ఇచ్చారు. పనిమీద లండన్ వెళుతూ ఆయన ప్రమాదానికి గురయి మరణించారంటున్నారు. విజయ్ రూపాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పని చేశారు. 2016 నుంచి 2021 వరకూ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Next Story

