Fri Dec 05 2025 17:33:32 GMT+0000 (Coordinated Universal Time)
సరిహద్దులో మహిళపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్ల అరెస్ట్
ఆగస్టు 26వ తేదీన పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పార్గనాస్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ నుంచి..

భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మహిళపై బీఎస్ఎఫ్ జవాన్లు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను అరెస్ట్ చేశారు. బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ను శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని నిందితులుగా చేర్చి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు.
ఆగస్టు 26వ తేదీన పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పార్గనాస్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన మహిళను దగ్గరలో ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ ఆ కానిస్టేబుల్ కు సహాయం చేసినట్లు ఆరోపణ ఉంది. బాధిత మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

