Fri Jan 24 2025 07:46:53 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదంలో యువటెన్నిస్ క్రీడాకారుడు మృతి
దారిమధ్యలో షంగ్ బంగ్లా ప్రాంతంలో రోడ్డుపై ఎదురుగా వచ్చిన భారీ వాహనం డివైడర్ ను ఢీ కొట్టి ఆపై ట్యాక్సీను ఢీ కొట్టి పక్కనే..
గువాహటి : తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వదీనదయాళన్ (18) ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విశ్వ అకాల మరణంతో భారత క్రీడావర్గాల్లో విషాదం నెలకొంది. నేషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ లో పోటీల్లో పాల్గొనేందుకు గువాహటి నుంచి షిల్లాంగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విశ్వ తన తోటి క్రీడాకారులైన రమేశ్ సంతోష్ కుమార్, అభినాష్ ప్రసన్న జి శ్రీనివాసన్, కిశోర్ కుమార్ లతో కలిసి ట్యాక్సీలో షిల్లాంగ్ కు బయల్దేరారు.
దారిమధ్యలో షంగ్ బంగ్లా ప్రాంతంలో రోడ్డుపై ఎదురుగా వచ్చిన భారీ వాహనం డివైడర్ ను ఢీ కొట్టి ఆపై ట్యాక్సీను ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. ట్యాక్సీ డ్రైవర్ అక్కడిక్కడే మరణించగా, కొన ఊపిరితో ఉన్న విశ్వ దీనదయాళన్ ను నార్త్ ఈస్ట్రన్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే విశ్వ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురు క్రీడాకారులను టోర్నీ నిర్వాహకులు మేఘాలయ ప్రభుత్వ సాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విశ్వ అండర్-19 స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అనేక పతకాలు సాధించాడు.
Next Story