Mon Dec 15 2025 23:45:25 GMT+0000 (Coordinated Universal Time)
నలంద యూనివర్సిటీలో కరోనా... 143 మంది వైద్యులకు
బీహార్ లోని నలంద వైద్య కళాశాలలో 143 మంది వైద్యులకు కరోనా సోకింది.

కరోనా వైరస్ భారత్ ను వణికిస్తుంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. భారత్ లో థర్డ్ వేవ్ మొదలయిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా బీహార్ లోని నలంద వైద్య కళాశాలలో 143 మంది వైద్యులకు కరోనా సోకింది. ఈ వైద్యులను వారం రోజులుగా కాంటాక్ట్ అయిన వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పాట్నాలోనే....
తొలుత నలంద వైద్య కళాశాలలో 72 మంది వైద్యులకు కరోనా సోకింది. మిగిలిన వైద్యులకు పరీక్షలు చేయించగా మరో 59 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బీహార్ లోని పాట్నాలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Next Story

