Fri Dec 05 2025 13:49:33 GMT+0000 (Coordinated Universal Time)
ధాన్యం బస్తాల మధ్యలో 13 ఏళ్ల బాలిక మృతదేహం
ఆమె ఒక టాప్ మాత్రమే ధరించింది.

ఆదివారం ఉజ్జయిని గ్రామంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమెను గొంతుకోసి హత్య చేశారు. బాలిక తన తాత ఇంట్లో కలిసి ఉండేది. శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు బాలిక కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆమె మృతదేహం ఇంటి మొదటి అంతస్తులో ధాన్యం బస్తాల మధ్య పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఆమెపై అత్యాచారం జరిగిందని. ఆ తర్వాత హత్య చేసినట్లు తేలిందని ఉజ్జయిని ఎస్పీ సత్యేంద్ర శుక్లా తెలిపారు. ఆమె ఒక టాప్ మాత్రమే ధరించింది. ఆమె శరీరంపై మెడతో సహా పలు చోట్ల గాయాల గుర్తులు ఉన్నాయి, ఆమెపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపినట్లు అనుమానం కలిగిస్తుంది అని ఫోరెన్సిక్ అధికారి ప్రీతి గైక్వాడ్ తెలిపారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. వారు తిరిగి వచ్చేసరికి బాలిక కనిపించకుండా పోయింది. వెతుకుతూ వచ్చారు. ఆదివారం మళ్లీ పైకి వెళ్లి చూడగా ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
News Summary - 13-year-old girl raped and killed at home in Ujjain
Next Story

