Thu Mar 19 2026 10:44:11 GMT+0530 (India Standard Time)
మటన్ బిర్యానీ తిని 12 మందికి అస్వస్థత
అక్కడ మటన్ బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..

హైదరాబాద్ సనత్ నగర్ లోని ఓ హోటల్ లో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. సనత్ నగర్ లో ఉన్న మాషా అల్లా అనే హోటల్ కు బుధవారం(మార్చి 23) రాత్రి కొందరు బిర్యానీ తినేందుకు వెళ్లారు. అక్కడ మటన్ బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, సర్కిల్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ డాక్టర్ రేణుల గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి హోటల్ లో తనిఖీలు నిర్వహించారు.
హోటల్ లో వండిన ఆహార పదార్థాలను పరిశీలించి వాటి శాంపిళ్లను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్ ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల శాంపిళ్లను పరీక్షించిన తర్వాత ఏమైనా లోపాలున్నట్లు తేలితే హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా.. అస్వస్థతకు గురైన 12 మందిలో ఆరుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవగా.. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.
Next Story

